ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడం, కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా సీఈసీ పనితీరుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించారు. తన పిటిషన్లో పది అంశాలను ఆయన ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని రాహుల్ గాంధీ కోరారు.


