ఆస్ట్రేలియా బౌలింగ్ దళం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయాన్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు. సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్ సమయంలో ఈ నలుగురు బౌలర్లు కలిసి ఆడిన మ్యాచ్‌లలో మొత్తం 600 వికెట్ల మైలురాయిని దాటారు. ఇప్పటివరకు 38 మ్యాచుల్లో 606 వికెట్లు పడగొట్టి టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన క్వార్టెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించారు.


