HomeHeadlinesతిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ ధర్మకర్తలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాదు శనివారం కొండపై దీపత్తూన వద్ద కార్తీక దీపం వెలగించాల్సిందేనని స్పష్టం చేసింది.తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం, దర్గా భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (CRPF)కు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రాజకీయ పెద్దల సూచనల మేరకు అధికారులు వ్యవహరించారనే ఆరోపణలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలని స్పష్టం చేసింది.

కొత్తగా నియమించిన రిసీవర్లు ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించింది.ఆలయ అధికారులు, సంబంధిత యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై ఎలాంటి బేరసారాలకు తావులేదని ధర్మాసనం పేర్కొంది. ఆలయ ధర్మకర్తలు అనుమతి ఇవ్వకపోవడంతోనే దీపం వెలిగించలేకపోయామని మదురై జిల్లా కలెక్టర్ కోర్టుకు వివరించారు.

ఈ విషయంలో క్షమాపణలు కూడా చెప్పారు. అయితే కలెక్టర్ వివరణ, క్షమాపణలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. ధర్మకర్తలు అనుమతించలేదనే కారణంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం కుదరదని పేర్కొంది.నోటీసులు అందుకున్న 13 మందిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్, డీజీపీ డాక్టర్ మహేశ్ అగర్వాలా, దేవాదాయ శాఖ అధికారులు, మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ, ఎస్పీ ఎల్. దేవనాథన్, ఆలయ ఈవో జి. సెల్వి, పాలక మండలి చైర్మన్, ట్రస్టీలు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments