HomeLifestyle5,10 లేదా 20 నిమిషాలు.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలో తెలుసా?

5,10 లేదా 20 నిమిషాలు.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలో తెలుసా?

వాకింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా భోజనం తర్వాత కాసేపు అటూఇటూ నడవడం శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం తీసుకున్న తర్వాత కండరాలు కదలడం వల్ల అవి రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగించుకుంటాయి. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ (Blood Sugar Spikes) అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కొన్ని నిమిషాలు నడవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 53 అధ్యయనాల ఆధారంగా ‘ఒబేసిటీ రివ్యూస్’ ప్రచురించిన మెటా-విశ్లేషణ ప్రకారం… కూర్చునే సమయానికి బ్రేక్ ఇస్తూ నడవడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలు తగ్గుతాయని స్పష్టమైంది. అయితే, ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments