దీపావళి వచ్చిందంటే ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇల్లు శుభ్రం చేయడం, రంగురంగుల లైట్స్ పెట్టడం, దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చడం.. ఇలా ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ హడావుడిలో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. అందుకే దీపావళి సెలబ్రేషన్స్‌కు ముందు ఇంట్లో కొన్ని ఫైర్ సేఫ్టీ చెక్స్ చేసుకోవడం మంచిది. మరి ఇంట్లో ఏయే విషయాలను ముందుగా చెక్ చేయాలో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.


