
అర్నబ్ తుఫాన్‌కు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం చంద్రబాబునాయుడు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. తుఫాన్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అదేవిధంగా భారీ వర్షాలతో రిజర్వాయర్లు నిండటం వ్యవసాయానికి ఉపయోగపడుతుందని, విపత్తును అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ పంట విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులకు తెలియజేశారు.


