US Stock Market: అమెరికా స్టాక్ మార్కెట్లు అక్టోబర్ 30 సెషన్లో భారీగా పతనం అయ్యాయి. ప్రముఖ చిప్ మేకర్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ఇందుకు కారణం. పలు టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాల్ని అందుకోలేకపోవడం, ఏఐ ఖర్చులు పెరుగుతుండగా దానికి తగ్గట్లుగా ఆదాయాలు లేకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ చిప్ మేకర్ ఇంటెల్ షేర్లు దారుణంగా పతనం అయ్యాయి. 1970 తర్వాత ఒక్కరోజులో 30 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం.


