Debt Trap Explain: ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లోన్స్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అయితే, వడ్డీ విషయంలో తెలియకుండానే యాప్స్ మాయాజాలంలో ఇరుక్కుపోతున్నారు. ఏడాదికి 54 శాతం వడ్డీతో లోన్ అంటే ఎవరూ తీసుకోరు, కానీ నెలకు 4.50 శాతం మాత్రమే, రోజుకు 15 పైసలు మాత్రమే అంటే తక్కువే అని ఆలోచిస్తారు. ఈ విషయంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు వంగ రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఆయన మాటల్లోనే ఈ మాయాజాలం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


