చేవెళ్ల సమీపంలో ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన విద్యార్థుల పార్టీపై పోలీసులు దాడులు చేశారు. మొత్తం 108 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిర్వాహకుడు మన్నన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసి.. ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ సరఫరా, పార్టీ నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులు, ఇతరుల ప్రమేయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


