న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా గత ఆరేళ్లుగా కొనసాగిస్తున్న అజేయ రికార్డుకు ఆక్లాండ్‌లో తెరపడింది. నాలుగో టీ20లో గ్లెన్ ఫిలిప్స్ (107) శతకంతో చెలరేగడంతో కివీస్ 259/7 రికార్డు స్కోరు సాధించగా, ఆ తర్వాత జాకబ్ డఫీ (4/23) దాటికి భారత్ 172/9కే పరిమితమైంది. దీంతో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది భారత్. 2020 నుంచి కొనసాగుతున్న 10 మ్యాచ్‌ల విజయ పరంపరకు ఫుల్స్టాప్ పెట్టింది. అయితే 3-1తో సిరీస్ ఇప్పటికే భారత్ సొంతమైంది.


