Child Savings Plan India: రోజురోజుకూ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే సంపాదన ఎటూ చాలట్లేదు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇతర వైద్య ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అందుకే పిల్లల చదువులు, ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయడం చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ సరైన ఆప్షన్లు ఎంచుకొని ముందు నుంచే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం సుకన్య సమృద్ధి యోజన, సిప్, పీపీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ వంటివి ఉండగా వీటి గురించి తెలుసుకొని లక్ష్యానికి తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.


