అర్నబ్ తుఫాన్ కారణంగా పంట నష్టాన్ని సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన.. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాను సృష్టించిన బీభత్సాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అమరావతి నుంచి ప్రారంభమై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు వరకు సీఎం ప్రయాణం సాగింది. నష్టాన్ని అంచనా వేసిన అనంతరం చంద్రబాబునాయుడు బాధిత రైతులతో కూడా మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నీట మునిగిన పొలాలు, కూలిన చెట్లు… ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబునాయుడు
RELATED ARTICLES


