InnoData Layoffs: ఉదయం ఎప్పటిలాగే లాగిన్ అయ్యి ఎవరి పని వారు చేసుకున్నారు. మధ్యాహ్నానికి ఒక్కసారిగా వారి తలరాతలు తలకిందులయ్యాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తమ ఉద్యోగం ఊడిందన్న వార్త పిడుగులా పడింది. తమ ల్యాప్టాప్స్ లాక్ అయ్యాయి, తమ ఐడీలు డీయాక్టివేట్ చేశారు. భారత్లో వందల మందిని తొలగిస్తూ ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్నోడేటా తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను షాక్కు గురి చేసింది. మరి ఈ కంపెనీ లేఆఫ్స్ విషయాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


