ఓ వ్యాపారవేత్త తిన్న రూ. 20ల కచోరీ ఆయన జీవితంలోనే అత్యంత ఖరీదైన స్నాక్‌గా మారింది. ఆకలి తీర్చుకోవడానికి ఆయన ఒక చోట ఆగగా, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన దగ్గరున్న రూ. 20 లక్షల నగదు ఉన్న సంచితో పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


