Gold Investment Dhanteras 2026: ధంతేరాస్ పర్వదినం సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డ్ గరిష్ఠాల నుంచి 20 శాతం మేర దిగివచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే, ఈ ధంతేరాస్ వేళ బంగారం కొనుగోలు చేయవచ్చా? బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయమా? బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలేంటి? అనేది ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


