Rattan Dhillon Reliance Shares: ప్రస్తుతం జియో ఐపీఓ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అక్టోబర్ 21-23 తేదీల్లో విజయవంతంగా సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకోగా, అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానుంది. ఈ క్రమంలోనే రత్తన్ ధిల్లాన్ అనే ఓ ఇన్వెస్టర్ ఎక్స్ వేదికగా అంబానీకి ఓ విజ్ఞప్తి చేశారు. తన దగ్గర ఫిజికల్ కాపీల రూపంలో ఉన్న రిలయన్స్ షేర్లను రికవరీ చేసుకోవడానికి సహాయం చేయండంటూ పోస్ట్ చేశారు. గతేడాది కూడా ధిల్లాన్ తన దగ్గరి రిలయన్స్ షేర్ల సర్టిఫికెట్లను పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఇది వైరల్ అయింది.


