HomeEntertainmentవెండితెరపై చెరగని సంతకం ‘ఆచి’ మనోరమ... 8 మంది సీఎంలతో నటించిన ఏకైక నటి

వెండితెరపై చెరగని సంతకం ‘ఆచి’ మనోరమ… 8 మంది సీఎంలతో నటించిన ఏకైక నటి

దక్షిణాది చిత్రసీమలో తన నటనతో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటి ‘ఆచి’ మనోరమ (గోపీశాంత). పేదరికంతో చిన్న వయసులోనే నాటకాల్లోకి ప్రవేశించి 1958లో సినీరంగ ప్రవేశం చేశారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఏకంగా 1,500కి పైగా చిత్రాలు, వేలాది నాటకాల్లో నటించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. సీఎన్‌ అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, జానకి, ఎంకే స్టాలిన్‌, విజయ్‌లతో పాటు తెలుగు లెజెండ్ ఎన్టీఆర్‌తో కలిసి ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో నటించిన ఏకైక నటిగా చరిత్ర సృష్టించారు. తెలుగులో ‘శుభోదయం’తో మొదలై ‘అరుంధతి’లో చంద్రమ్మగా చిరస్థాయిగా నిలిచిన ఆమెను కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments