ఎస్ఐఆర్, ఓట్ చోరీ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న వేళ.. మోదీ సర్కార్ ముందు కీలక డిమాండ్లు పెట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయడం, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఇక యూపీలో ఓటర్ల నమోదు వివరాలపై అనుమానాలు వ్యక్తం చేసిన మల్లికార్జున ఖర్గే.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.


