ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టనున్న నిరసన ర్యాలీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగల సీజన్ వేళ.. ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీలో వ్యాపారులు కోరిన నేపథ్యంలో రాహుల్ కీలక సూచన చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరితే తమ నిరసనను 30 సెకన్లలోనే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ.10 వేల కోట్ల వరకు వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చని వ్యాపార సంఘం అంచనా వేసింది.


