న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజున భారత ‘ఎ’ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (199) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో భారత్‌ను అత్యుత్తమ స్థితిలో నిలిపాడు. సాయి సుదర్శన్ (215 పరుగుల భాగస్వామ్యం), యష్ రథోడ్లతో కలిసి సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ ‘ఎ’ జట్టు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది.


