ఇండోనేషియాలోని పర్యాటక స్వర్గధామం అయిన బాలిలో స్థానిక హిందూ సంప్రదాయాలను తీవ్రంగా అవమానించినందుకు గాను ఒక స్విట్జర్లాండ్ పర్యాటకుడికి స్థానిక న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. అత్యంత పవిత్రంగా భావించే ‘న్యేపి’ పండుగ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. నిర్మానుష్యంగా ఉన్న బీచ్‌లోకి వెళ్లి అసభ్యకర పదజాలంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన 26 ఏళ్ల లుజియాన్ ఆండ్రిన్ జుగ్రాగెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుల మనోభావాలను గాయపరిచినందుకు గాను కోర్టు ఈ కఠిన తీర్పును వెలువరించింది.
హిందూ పండుగను హేళన చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన స్విస్ పౌరుడు.. బాలిలో అరెస్ట్ చేసిన పోలీసులు
RELATED ARTICLES


