తల్లి కావడం ప్రతి స్త్రీకి ఒక అద్భుతమైన అనుభవం. కానీ సిజేరియన్ తర్వాత రెండో గర్భం విషయానికి వస్తే.. అనేక ప్రశ్నలు, భయాలు తలెత్తుతాయి. ఇద్దరు పిల్లల మధ్య ఎంత కాలం గ్యాప్ ఉండాలి? మరియు సిజేరియన్ తర్వాత సాధారణ ప్రసవం ఎప్పుడైనా సాధ్యమేనా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. సిజేరియన్ డెలివరీ తర్వాత రెండోసారి గర్భం దాల్చడానికి కనీసం 18 నుంచి 24 నెలల (ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల) విరామం ఉండడం అత్యంత శ్రేయస్కరం.
కనీసం 18 నెలల సమయం ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ గ్యాప్ ఎందుకు అవసరం? గ్యాప్ లేకపోతే వచ్చే సమస్యలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటి గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ తాన్య ఎస్. పి.(కన్సల్టెంట్ – ప్రసూతి మరియు స్త్రీ వైద్య విభాగం, కిండర్ హాస్పిటల్స్, బెంగళూరు) అందించారు.


