1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్, టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్ వంటి సంస్థల ద్వారా సాంకేతిక విప్లవం సృష్టించారు. మస్క్ వారానికి దాదాపు 80 నుంచి 100 గంటలు పని ఒత్తిడిలో గడుపుతారు. టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్ వంటి సంస్థలను నడపడంలో వచ్చే నిరంతర ఆందోళనలు, వివాదాలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎంతటి సంపద ఉన్నా మానసిక ప్రశాంతతను సులభంగా దూరం చేయగలవని ఆయన అనుభవాలే స్పష్టం చేస్తున్నాయి. అపారమైన సంపదను చూసిన వ్యక్తిగా ఆయన అనుభవం నుంచి చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్కరికీ జీవిత ప్రాధాన్యతల్ని గుర్తుచేస్తాయి.


