స్నానం చేసిన కొద్దిసేపటికే చంకల్లో చెమట పట్టి దుర్వాసన వస్తుందా? ఈ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఉక్కపోత, తేమ కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. అయితే చెమటకు స్వతహాగా పెద్దగా వాసన ఉండదు. చర్మంపై సహజంగా ఉండే బ్యాక్టీరియా చెమటలోని కొన్ని పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు దుర్వాసన ఏర్పడుతుంది. హార్మోన్ల మార్పులు, ఎక్కువగా చెమట పట్టడం, బిగుతైన దుస్తులు, చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాలు కూడా దుర్వాసన వస్తుంది.
ఈ దుర్వాసన వల్ల బయటకు వెళ్లినప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపించవచ్చు. అందుకే ఖరీదైన ఉత్పత్తులకంటే ముందుగా ఇంట్లో పాటించగల కొన్ని సాధారణ పరిశుభ్రత పద్ధతులపై దృష్టి పెట్టడం మంచిది. మరి చంకల్లో దుర్వాసన తగ్గించుకోవడానికి ప్రతిరోజూ పాటించగల సులభమైన చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


