HomeAndhra Pradesh'వెలిగొండ'లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు!

‘వెలిగొండ’లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు!

వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన సుంకేసుల – కలనూతల మార్గంలో నలుగురు వ్యక్తులు బొలెరోలో రోడ్డు దాటుతుండగా, వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోగా.. ముగ్గురు ఒక చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. రాత్రి వేళ ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న అధికారులు, ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్తనాదాలు పెడుతున్న ముగ్గుర్ని జేసీబీ సాయంతో అగ్నిమాపక, పోలీసు సిబ్బంది కాపాడారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments