HomeAndhra Pradeshముంబై నటి కాదంబరి జత్వానీ కేసు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీలపై 2 ఏళ్ల తర్వాత...

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీలపై 2 ఏళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు సర్కార్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తక్షణమే వారిద్దరినీ సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేసినంత మాత్రాన వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసులపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రభావం చూపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో వారికి పోస్టింగ్‌లు కేటాయించే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments