ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో ఆదివారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు 9 ఫైనల్స్‌లో 7 టైటిళ్లు సాధించి భారత్ తిరుగులేని రికార్డు కలిగి ఉంది. 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీని గెలుచుకున్న శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంకతో ఫైనల్స్‌లో 5-1 రికార్డు కలిగిన భారత్, ఈసారి 8వ ఆసియా కప్ ట్రోఫీతో రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


