ఎన్ని కాలాలు మారినా కొన్ని పద్ధతులు అస్సలు మారవు. మధ్యలో కొత్త కొత్త అలవాట్లు చేసుకున్నా కూడా మళ్ళీ పాతకాలం నాటి పద్ధతులని ఫాలో అవుతాం. అలాంటి వాటిలో జుట్టుకి సంబంధించి ఆముదం రాయడం కూడా ఒకటి. జుట్టుని పెంచుకోవాలనుకునే వారు మార్కెట్లోకి ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ వస్తే అన్నీ వాడతారు. అవన్నీ వాడినప్పటికీ ఆముదం కూడా వారి హెయిర్ కేర్ రొటీన్లో ఉండనే ఉంటుంది. జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో ఆముదానికి ప్రత్యేక స్థానం ఉందని చెబుతారు అప్పటి పెద్దల నుంచి ఇప్పటి హెయిర్ ఎక్స్పర్ట్స్.
ఆముదాన్ని కొంతమంది హెయిర్ టానిక్ అని కూడా అంటారు. కారణం ఇందులోని గుణాలు జుట్టు సమస్యల్ని దూరం చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అందుకోసం ఆముదం రాస్తే సరిపోతుందనుకోవద్దు. అది రాయడానికి ఓ పద్ధతి ఉంటుందని, దాన్ని ఫాలో అయితేనే సరైన రిజల్ట్స్ చూస్తారని చెబుతున్నారు డాక్టర్ దివ్య సిద్దవరం(సీనియర్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్).