ఉమెన్స్ ఏషియన్ గేమ్స్ క్వార్టర్స్‌లో జపాన్‌పై భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జపాన్.. శ్రీ చరణి (410) స్పిన్ ధాటికి 57 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 58 పరుగుల ఛేదనలో షఫాలీ వర్మ (15 బంతుల్లో 40*) సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో భారత్ కేవలం 5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది.


