SBI Fixed Deposit Interest Rates: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ కీలక రెపో రేట్లను మార్చకున్నా తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పుల్ని ప్రకటించింది. డొమెస్టిక్ బల్క్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర ఎంపిక చేసిన టెన్యూర్లపై తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్ట్ 15 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.


