చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో తొలిరోజే ఈస్ట్ జోన్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల కొండంత స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111*) సెంచరీతో మెరవగా, శిఖర్ మోహన్ (85), కుమార కుషాగ్ర (63*) అర్థశతకాలతో రాణించారు. సౌత్ జోన్ బౌలర్లలో సిరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు.


