ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఆడుతున్నాడు. ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న అతడు.. సెమీఫైనల్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటాడు. 36 ఏళ్ల వయసులోనూ షమీ అద్భుతంగా ఆడుతున్నాడని ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసించాడు. ఇప్పటికీ అతడిలో జాతీయ జట్టులోకి రావాలనే కసి ఉందని కొనియాడాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు.


