ఒబేసిటీ పారాడాక్స్ అంటే ఊబకాయ వైరుధ్యం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని జర్నల్ ఆఫ్ థొరాసిక్ ఆంకాలజీలో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం చెబుతోంది. పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వుని లంగ్ క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతూ ఎన్నో ముఖ్య విషయాలన్ని ఈ పరిశోధనలో వెల్లడించారు పరిశోధకులు. ఒబేసిటీ పారడాక్స్ అంటే హై బాడీ మాస్ ఇండెక్స్, తగ్గిన లంగ్ క్యాన్సర్ ప్రమాదం మధ్య ఓ సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీని గురించి మరెన్నో ముఖ్య విషయాలని కూడా చెబుతున్నారు.


