Jio Platforms IPO Dates: ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న జియో ఐపీఓపైనే నెలకొంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలవనుండగా మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జియో ఎలా పుట్టిందనే అంశం తెరపైకి వచ్చింది. కాలేజీ అసైన్మెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేకపోయిన అనుభవమే జియో ఆలోచనకు నాంది పలికిందని ఇటీవల ఈశా అంబానీ వెల్లడించారు. ఆకాశ్ అంబానీ సూచనతో 2016లో జియో లాంఛ్ అయింది.


