బట్టలు ఉతికిన తర్వాత మంచి సువాసన రావాలని చాలామంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వాడుతుంటారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల బట్టలపై అవశేషాలు మిగిలి, అవి గట్టిగా అనిపించవచ్చు. టవల్స్, జిమ్ దుస్తులు వంటి వాటిలో తేమ, చెమట వాసన కూడా పూర్తిగా పోకపోవచ్చు. ఇలాంటి సమస్యలకు వైట్ వెనిగర్‌ను వాషింగ్ మెషీన్లో ఉపయోగించే సింపుల్ హోమ్ హ్యాక్ ఎంతో సహాయపడుతుంది. అదేలాగో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


