వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే శరీరానికి సరైన ప్రయోజనం కలగాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి, ఎంత సమయం కేటాయించాలి అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఒక తాజా అధ్యయనం ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. స్ప్రింట్ ఇంటర్వెల్ ఎక్సర్సైజ్ అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం అని ఆ పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని రాక్ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ ‘సెల్ రిపోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.


