టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా సోషల్ మీడియా వేదికల్లో దారుణమైన సైబర్ దాడి జరుగుతోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, రూపురేఖలను కించపరుస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడటమే కాకుండా, ఫోటోలను వికృతంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ స్టిక్కర్లు, జిఫ్‌లుగా ఇతర రాష్ట్రాల్లోనూ విరివిగా వ్యాప్తి చేస్తున్నారు. సాధారణ సరదా పరిమితులు దాటి వ్యక్తిత్వ హననం స్థాయికి చేరిన ఈ వికృత పోకడలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన గుర్తింపును దుర్వినియోగం చేయకుండా ఢిల్లీ హైకోర్టు నుంచి ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణ పొందిన నేపథ్యంలో, ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న నిందితులపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
డిజిటల్ తెరపై వికృత క్రీడ.. ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నెట్టింట దారుణమైన ట్రోలింగ్
RELATED ARTICLES


