మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్, దర్శకుడు తేజ కాకుమాను కాంబినేషన్లో అనిల్ సుంకర నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అటవీ నేపథ్యంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో సాగే ఈ యాక్షన్ డ్రామాలో సాయితేజ్‌కి జోడీగా ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, జాతీయ స్థాయి స్విమ్మర్ అయిన ఈ కన్నడ బ్యూటీకి ఇది టాలీవుడ్లో కీలక అవకాశం కానుంది. ఈ నెలాఖరులోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు సాయితేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న విడుదల కానుంది.
‘కాంతార’ బ్యూటీకి టాలీవుడ్లో బంపర్ ఆఫర్.. సాయితేజ్ కొత్త చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్!
RELATED ARTICLES


