HomeEntertainmentఉర్రూతలూగిస్తున్న ‘మమ్మా మియా’.. ‘ఫీల్‌ గుడ్‌’ మూవీ నుంచి అదిరిపోయే యూత్‌ఫుల్ ట్రాక్

ఉర్రూతలూగిస్తున్న ‘మమ్మా మియా’.. ‘ఫీల్‌ గుడ్‌’ మూవీ నుంచి అదిరిపోయే యూత్‌ఫుల్ ట్రాక్

సుచిత్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’. దయానంద్ దర్శకత్వంలో విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో అదితి త్రిపాఠి కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ అనే యూత్‌ఫుల్ లవ్ ట్రాక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కడలి సత్యనారాయణ సాహిత్యం అందించిన ఈ పాటకు శాండిల్య పిసపాటి సంగీతంతో పాటు తుషార నిలయతో కలిసి ఆలపించారు. నేటి తరం ట్రెండీ పదాలతో సాగే ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments