Hyderabad Traffic Police Strict Action On Fake Number Plates: హైదరాబాద్లో వాహనదారులకు ముఖ్యమైన గమనిక. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ,అక్రమాలకు పాల్పడటానికి నంబర్ ప్లేట్లను మారుస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీని కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి జోయల్ డేవిస్ వాహనదారుల్ని అలర్ట్ చేశారు.


