Centre Denies Permission For Revanth Reddy Us Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది.. దీంతో ఆ పర్యటన రద్దైంది. ఈ నెల 20 నుంచి 29 వరకు లండన్, అమెరికా పర్యటనల కోసం తెలంగాణ సీఎంవో అనుమతి కోరగా.. కేంద్రం లండన్ పర్యటనకు మాత్రమే అనుమతించింది. దీంతో రేవంత్ లండన్ పర్యటన ముగించుకుని ఈనెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు.


