ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన, సరికొత్త ప్రపంచ రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. రెడ్ బాల్ ఫార్మాట్లో మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు (9) పడగొట్టిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతేకాకుండా, టెస్ట్ మ్యాచ్‌లోని తొలి బంతికే బ్యాటర్లను పెవిలియన్ చేర్చిన బౌలర్ల జాబితాలోను అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు.


