మహిళల టీ20 ఆసియాకప్ 2026 ఫైనల్‌కు ఏసీసీ ప్రెసిడెంట్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హాజరవుతుండటంతో మళ్లీ ట్రోఫీ వివాదం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది పురుషుల ఆసియా కప్‌లో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా అజేయంగా సెమీస్‌కు చేరింది. ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


