నాన్‌వెజ్ ప్రియులు చికెన్, చేపలు, మటన్ తినడానికి ఇష్టపడతారు. కొంతమంది ప్రతి వారం లేదా రోజు విడిచి మరో రోజు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. ఇక, సండే అయితే చాలా మంది మటన్ తినడానికి ఇష్టపడతారు. అయితే, మటన్‌ను వండటం కొంచెం కష్టమైన పని. చికెన్‌తో పోలిస్తే మటన్ ఉడకడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. దానిని ప్రెషర్ కుక్కర్‌లో వండకపోతే, ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.
అయితే, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. గ్రామీణ వంటకాల్లో మటన్ కర్రీ చేసేటప్పుడు అందులో మామిడి ఆకును వేయడం ఒక సంప్రదాయంగా కనిపిస్తుంది. చాలామంది దీనిని సాధారణ ఆచారం అనుకుంటారు కానీ, దీని వెనుక ఒక చక్కటి శాస్త్రీయ కారణం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా విన్నూస్ కిచెన్‌లో ఈ రీజన్ ఏంటో చెప్పారు. అసలు మటన్ వండేటప్పుడు మామిడి ఆకు ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


