HomeLifestyleబాడీలో హ్యాపీ హార్మోన్ పెరిగి మీ మూడ్ మారాలంటే తినాల్సింది వాల్‌నట్స్, ఎందుకో తెలుసా?

బాడీలో హ్యాపీ హార్మోన్ పెరిగి మీ మూడ్ మారాలంటే తినాల్సింది వాల్‌నట్స్, ఎందుకో తెలుసా?

మనం చురుగ్గా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తినడం వల్ల శరీరానికి కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు మాత్రమే కాకుండా అంతకుమించిన ప్రయోజనాలు ఉంటాయని ‘ఫుడ్ & ఫంక్షన్’ (Food & Function) జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.

ప్రతిరోజూ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మూడ్ మెరుగుపడుతుందని, శరీరంలో సెరోటోనిన్‌కు సంబంధించిన జీవక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. యువకులు 8 వారాల పాటు రోజూ వాల్‌నట్స్ తిన్నప్పుడు వారిలో మానసిక చికాకులు, ఒత్తిడి సంబంధిత అశాంతి గణనీయంగా తగ్గినట్లు తేలింది. అలాగే వారి మూత్రంలో సెరోటోనిన్ జీవక్రియకు సంబంధించిన పదార్థాల పరిమాణం పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments