HomeAndhra Pradeshపదో తరగతి చదివి 'డీఎస్పీ' అయిపోయాడు.. నిరుద్యోగులకు ఫేక్ ఎస్‌ఐ ఆర్డర్స్ ఇచ్చి రూ.26 లక్షలు...

పదో తరగతి చదివి ‘డీఎస్పీ’ అయిపోయాడు.. నిరుద్యోగులకు ఫేక్ ఎస్‌ఐ ఆర్డర్స్ ఇచ్చి రూ.26 లక్షలు దోపిడీ

ఏలూరు పోలీసులు ఓ మోసగాడి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ 10 వ తరగతి చదువుకున్నాడు. అయితే ఈజీ మనీకి అలవాటుపడ్డ అతడు.. జనాలను మోసం చేసే దందాకు తెరతీశాడు. తనను తాను డీఎస్పీగా ప్రచారం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నిరుద్యోగులకు వల వేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు కాజేశాడు. ఆఖరికి ఇద్దరి యువకులకు ఎస్‌ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి దగ్గర నుంచి రూ.26 లక్షలు తీసుకున్నాడు. వారి చేతుల్లో ఫేక్ ఎస్‌ఐ అపాయిమెంట్ లెటర్లను పెట్టాడు. తర్వాత అవి ఫేక్‌వి అని తెలిసి.. పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments