ఆర్టీసీ కొత్త బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాదికి 3000 సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సుు వస్తాయని సంస్థ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, టెండర్ల పనులు అవుతున్నాయని చెప్పారు. అంతేకాదు డిసెంబర్‌లో కొత్తగా 750 ఈ బస్సులు రోడ్డెక్కుతాయని తెలిపారు. ఇదే సందర్భంలో సంస్థలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల రక్షణ కోసం చర్యలు కూడా తీసుకుంటున్నామని జేఎండీ శివప్రసాద్ తెలిపారు.
రోడ్డెక్కనున్న 3000 కొత్త ఆర్టీసీ బస్సులు.. త్వరలోనే 750 ఈ-బస్సులు రాబోతున్నాయ్
RELATED ARTICLES


