కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఎంపీపీ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మందిలో తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఉన్నారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, నృత్య రూపకాలతో బోధన వంటి వినూత్న విధానాలను ఆమె అమలు చేస్తున్నారు. వచ్చే నెల 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు.


