ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ శాంతి బహుమతి 2026కు భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాలో సాధారణ భారతీయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచి పేదరికంతో పోరాటం చేశారు. ఏడుగురు సంతానంలో ఒకరైన ఆమె.. జాతివివక్షపై గళమెత్తారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆమె.. దక్షిణాఫ్రికా హైకోర్టుకు న్యాయమూర్తి అయిన తొలి నల్లజాతి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. ఐరాస మానవహక్కుల విభాగం హైకమిషనర్గానూ ఆమె సేవలను అందించారు.
నవనీతమ్ నవీ పిళ్లై… సాధారణ బస్సు డ్రైవర్ కుమార్తె నుంచి నోబెల్ శాంతి బహుమతి విజేతగా..
RELATED ARTICLES


