పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పు అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ డిమాండ్‌కు దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు 1999లో మొదటిసారి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పటి సీఎం జ్యోతిబసు అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్రం ఆమోదించలేదు. తర్వాత మమతా బెనర్జీ సైతం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పుడేమో బీజేపీ వంతు వచ్చింది. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ఎందుకు మార్చాలని కోరుతున్నారు? దానికి కారణాలు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారాయి.


